నకిలీ మద్యం గురించి కూటమి నాయకులు నోరు మెదక పోవటం ఎమిటని రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్, దర్శినియోజక వర్గ సమన్వయ కర్త కైపు క్రిష్ణా రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మంచినీళ్ల కన్నా మద్యం నులవుగా దొరుకుతుందని, గతంలో మద్యం పాలసీ పై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నోరు మొదకప పోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బార్లు, వైన్ షాపులకు అధికంగా అనుమతులు ఇచ్చి అందులో నకిలీ మద్యం కూడ సరఫరా చేయటం దారుణమైన విషయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెలుకొని అధికారులతో తనిఖీలు నిర్వహించి బెల్ట్ షాపులను అరికట్టి మద్యం నాణ్యతను పరిశీలించి సరఫరా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు
