ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లాలో నేరం చేసి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను ఎమ్ ఎస్ సీడి పద్దతి ద్వారా జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది జల్లెడ పడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ ఒకటోవ తారిఖు నుండి ఇప్పటి వరకు 5295 ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు.
గతంలో నేరాలు చేసిన ఎమ్ ఎస్ సీడి ద్వారా 15 మంది పాత నేరస్తులను గుర్తించి స్ధానిక పోలీస్ స్టేషన్ లలో బైండ్ ఓవర్ చేసారు.
ప్రతి రోజు రాత్రి సమయంలో బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతంలో అనుమానం ఉన్న వ్యక్తుల వద్ద నుండి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు.
అంతేకాకుండా సమయం దాటిన తరువాత రోడ్డు మీద తిరుగుతున్న వారిని గుర్తించి వారి వద్ద నుండి కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి సినిమా వదిలిపెట్టిన , తెల్లవారుజామున ప్రధానమైన మార్కెట్ సెంటర్లవద్ద అనుమానంగా తిరుగుతున్న వ్యక్తుల వద్ద నుండి ఫింగర్ ప్రింట్స్ తీసు కున్నారు.
ఇలా చేయడం ద్వారా పాత నేరస్తులను గుర్తించతో పాటు జిల్లా లో ఎవరైనా నేరం చేస్తే.. ఇట్టే నేరస్తులను పట్టుకునేందుకు వీలుంటుందని తెలిపారు.
మరోవైపు ఇతర ప్రాంతాల నుండి బిల్డింగ్ వర్క్స్, సిమెంట్ పనులు నిమిత్తం వస్తున్న వారి వద్ద నుండి కూడా సాయంత్రం సమయంలో ఫింగర్ ప్రింట్స్ తీసుకోకున్నారు.
హోటల్ లో పని చేసే వారిని సైతం వదల కూడా ఫింగర్ ప్రింట్స్ తీసారు.
జిల్లా వ్యాప్తంగా ఈ పక్రియ నిరంతరం కోనసాగిస్తునే ఉంటామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఈ విధంగా చేయడం ద్వారా ఇతర జిల్లాల నుండి ప్రకాశం జిల్లా కు వచ్చి నేరం చేసేందు నేరస్తుల భయపాడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

