జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రకాశం భవనంలోని వివిధ విభాగాలను శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. పి.జి.ఆర్.ఎస్ ( మీకోసం ) ఆడిట్ టీము, సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ విభాగం పనిచేస్తున్న ఆఫీసులను జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డిఆర్ఓ బి.చిన ఓబులేసులతో కలిసి తనిఖీ చేశారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టిజిఎస్ మాదిరిగా కలెక్టరేట్ లోనూ సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన గది కోసం పరిశీలించారు. వీరి వెంట కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు ఉన్నారు.





