దర్శి భవిత కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి దివ్యాంగుల చట్టాలను వక్తలు వివరించారు. సీనియర్ న్యాయ వాది పరిటాల సురేష్, పారా లీగల్ వలంటీర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కపురం శ్రీనివాస రెడ్డి, మండల న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి పద్మ, భవిత కేంద్రం ఐఈడీ గోపాలుని సుబ్రమణ్యం, గురువర్జున రావులు పాల్గొని దివ్యాంగుల పట్ల సమాజానికి, తల్లిదండ్రులకు ఉన్న బాధ్యతను, వారికి ఇవ్వాల్సిన చేయూత గురించి వివరించారు.

