హైదరాబాద్ అక్టోబర్ 11( జే ఎస్ డి ఎం న్యూస్)
విద్య ద్వారా మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేయవచ్చని భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఫర్ ఉమెన్ 45వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అతిథిగా ఐ పి ఎస్ అధికారి దీపాలి మసీర్కర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తల్లి దండ్రుల భాషను కాపాడు కోవడం,భారత దేశం విశ్వ గురువుగా వున్న ఘనతను,యువ శక్తి వలన సాధించే అవకాశాలను వివరించారు.మొదట 15మందితో ప్రారంభ మైన ఈ కళాశాల ప్రస్తుతం 3495 విద్యార్ధులతో అభివృద్ధి చెందిందన్నారు.తల్లి దండ్రులు గురువులను ఆదరించండి అంటూ ఆయన పిలుపు నిచ్చారు.గౌరవ అతిథి దీపాలీ మసీర్కర్ మాట్లాడుతూ కళాశాల మూలాలను గౌరవించాలని అన్నారు.నేర్చుకోవడం ఎప్పటికీ అపవద్దని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో కే.శశికాంత్,రమాదేవి లంకా తదితరులు పాల్గొన్నారు.ఈ పట్ట బద్రుల వేడుకలో మొత్తం 981 మంది విద్యార్థులు పట్ట బద్రుల ధృవీకరణ ను పొందారు.ఆర్ట్స్ విభాగంలో. ఉమైమా బజాజ్ మూడు బంగారు పతకాలు అందుకోగా,కామర్స్ విభాగంలో నాంపల్లి సుప్రియ ,వర్షా,సైన్స్ విభాగం లో బి.అశ్వినీ నాలుగు బంగారు పతకాలు అందుకున్నారు.





