జీఎస్ టి 2.0 ప్రయోజనాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్న గ్రేట్ ప్రకాశం డిస్ట్రిక్ షాపింగ్ ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ …అహార పదార్ధాలు, వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్, మందులు పై జీఎస్టి గణనీయంగా తగ్గాయని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ ..ఈ తగ్గిన రేట్లను వినియోగదారులు అస్వాదించాలని కోరారు. వ్యాపారులు తమ వ్వాపారాలను పెంచుకోవటానికి మంచి అవకాశం అని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, రాష్ట్ర జీ ఎస్ టి డిప్యూటీ కమీషనర్ సత్య ప్రకాశ్, సర్కిల్ అసిస్టెంట్ కమీషనర్లు రవి కుమార్, సీహెచ్ కోటేశ్వర రావు, ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ ధనలక్ష్మి, ఎపీ ఐఐ సీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

