విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వి వో ఏ)ల మూడేళ్లు మాత్రమే పనిచెయ్యాలన్న జీవోను కూటమి ప్రభుత్వం తొలగింపు పట్ల పొదుపు సంఘాల వివోలు హర్షం వ్యక్తం చేసారు. వెలుగు కార్యాలయం ఆవరణలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ డీ సీఎం పవన్ కళ్యాణ్ ల చిత్ర పటాలకు వివో ఏ లు పాలాభిషేకం నిర్వహించారు. గతంలో వివోఏల తొలగింపు బాధ్యత మండల స్థాయి అధికారులకు ఉండేది రాజకీయ వత్తిడిల కారణంగా తొలగింపులు జరిగేవి ఈ జీవోఆధారంగా ఆ అధికారం జిల్లా స్థాయి పీడీ బదిలీ అయినది . దీంతో కొంత మేర రాజకీయ ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నందున పొదుపు సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేసారు. ఎపీఎం దేవరాజ్, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, నాటక రంగ కార్పోరేషన్ డైరెక్టర్ బి ఓబులు రెడ్ది, స్థానిక నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడిపర్తి లక్ష్మి నారాయణ, నాగేశ్వర రావు, శ్రీను , ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత, పొదుపు సంఘ బాధ్యులు అంజమ్మ, మాధవి తదితరులు పాల్గొని పాలాభిషేకం చేసారు.
