ప్రజల చేతిలో పాశుపతాస్త్రం నమాచార హక్కు చట్టం అని వక్తలు అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. సమాచార హక్కు చట్టం గురించి తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎపీఎం దేవరాజ్, స్థానిక నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్, గ్రామ కార్యదర్శులు షహనాజ్ బేగం, శేషమ్మ, క్రిష్ణ, డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాస రావు, మాధవరావు, మస్తాన్, పొదుపు సంఘ సభ్యులు, రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.
సమాచార లోపంతో తూ.. తూ మంత్రంగా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు……
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు మండల స్థాయి అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు సరైన సమాచారం ఇవ్వక పోవటంతో ప్రచార లోపానికి నోచుకుంటున్నాయని ప్రభుత్వ అభిమానులు అంటున్నారు. కేవలం ఉన్నత స్థాయి అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించాలని వాట్సాప్ గ్రూప్ లో కోరుతున్నారు. కాబట్టి కార్యక్రమాలు తూ… తూ మంత్రంగా నిర్వహించి ఆ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడ పూర్తిగా ప్రచారానికి నోచుకోవటం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సమాచార హక్కు చట్టం ర్యాలీ గా పేర్కోనవచ్చు. ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని పట్టుమని నలుగురు కూడ లేక పోవటంతో క్లాప్ మిత్రలను, కార్యాలయంలో పనిచేసే పనివారిని పిలుచుకుని స్థానిక నాయకులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ.. నాయకుడు మరోక నలుగురికి ప్రోగు చేసి వెల్లంపల్లి బస్టాండ్ వద్దకు వెళ్లి అంటూ అక్కడ ఉన్న ప్రజలను, రిటైర్డు ఉద్యోగులను కలుపుకుని కార్యక్రమం మమ అని పించారు. ఇటీవల నిర్వహించిన జీఎస్టి అవగాహన కార్యక్రమాలు కూడ ఇవే కోవకు చెందినవిగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించి దేశ నాయకులు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు, శిక్షణ తరగతులు కూడ ఇలాగే జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సరియైన సూచనలు చేసి కార్యక్రమాలు చిత్త శుద్ధితో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
