ఆర్టీసీ యాజమాన్య చెయ్యి ఎత్తండి.. బస్సు ఎక్కడి అన్న నినాదంతో ముందుకు వెళ్తుంది. అయితే ఆర్టీసీ సిబ్బంది మాత్రమే ప్రయాణికులు చెయ్యి ఎత్తినా బస్సు ఆపం …. అంటూ వెళ్లిపోతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
తాళ్లూరు – లక్కవరం ఆర్టీసీ బస్సు ఆదివారం తాళ్లూరు నుండి ఒంగోలు వెళ్తుండగా మండల కార్యాలయాల కాంప్లెక్స్ వద్ద పంచాయితీ కార్యదర్శి, సిబ్బంది చెయ్యి ఎత్తినప్పటికి ఆపక పోవటంతో మోటార్ సైకిళ్లపై బస్సు వెనక స్పీడుగా వెళ్లి పలువురు బస్సు ను ఎక్కించి వచ్చారు. దీంతో ఉద్యోగులు ఇలా బస్సు వెనక పడవలసి వస్తే సామాన్యుల పరిస్థితి ఎమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది తగిన సూచనలు ఇచ్చి ప్రయాణికులను గమనించి ఎక్కించుకోవాలని సూచించాలని ప్రజలు కోరుతున్నారు.
