శేరిలింగంపల్లి అక్టోబర్ 13(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆడ పడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ ,శేరిలింగం పల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పేదింటి కుటుంబాల్లోనూ ఆడబిడ్డ పెళ్లి అంటే భారం కాకూడదని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా వారికి మేలు జరుగుతుందని అన్నారు. లబ్ధిపొందిన మహిళలు డబ్బులను వృధా చేయకుండా అవసరానికివినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, తదితర డివిజన్ల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


