జిల్లాలో జరుగుచున్న రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేసేలా పనులను వేగవంత చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు,
ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లోని తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఆర్ అండ్ బి అధికారులతో సమావేశమై జిల్లాలో జరుగుచున్న రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులు మరియు ప్రతిపాదిత పనులపై సమీక్షించారు. జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో వున్న రహదారుల వివరాలు, జరుగుచున్న పనుల పురోగతి, ప్రతిపాదిత పనుల వివరాలను ఆర్ అండ్ బి ఎస్ఈ రవి నాయక్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు సమగ్రంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో జరుగుచున్న రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా దెబ్బతిన్న రోడ్లను బాగుచేయడానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో రహదారులకు సంబంధించి ఇచ్చిన హామీలపై అధికారులు దృష్టి సారించి సంబంధిత పనులు పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అలాగే జిల్లాలో జరుగుచున్న రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, వంతెనలు, భవనాల నిర్మాణాల పురోగతిపై పనుల వారీగా సమగ్ర నివేదిక అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి ఎస్ఈ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ రవి నాయక్, ఈఈ, డిఈ లు తదితరులు పాల్గొన్నారు.


