భవిష్యత్ లో రాబోవు ఎన్నికలలో తన స్థానంలో తన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి పోటీ చేసి ప్రాధినిధ్యం వహిస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో ఘన సన్మాన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …తాను 2024 ఎన్నికలలో మాగుంట రాఘవ రెడ్డికి తన స్థానం కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరినప్పటికి మీ వారసుడి విషయం తాను చూసుకుంటారని ఈ దఫా తప్పనిసరిగా మీరే పోటీచెయ్యాలని సీఎం సూచన మేరకు తాను పోటీ చేసారని చెప్పారు. రాబోవు ఎన్నికలలో తప్పకుండా వారసుడు ఎంట్రీ ఉంటుందని చెప్పారు. మాగుంట సుబ్బ రామి రెడ్డి వద్ద నుండి నేటి వరకు తమ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా వాసులు ఆదరించారని వారి రుణం తీర్చుకోలేనిదని అదే అదరణ తన కుమారుడిపై చూపాలని కోరారు. తాను తర్వాత రాజకీయాల నుండి రిటైర్డ్ అవుతానాన లేదా అనేది కాలం నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.
ఘనంగా ఎంపీ మాగుంట జన్మదిన వేడుకలు…..
ఎంపీ మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలు రామ్ నగర్ 2వ లైన్లో మాగుంట కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తనయుడు మాగుంట రాఘవ రెడ్డి , మాగుంట నిఖిల్ బాబు, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, సంతనూతల పాడు శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, ఓడా చైర్మన్ రియాజ్ ల అధ్వర్యంలో కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, అయినా బత్తిన ఘన శ్యామ్, తాతా ప్రసాద్, రంగ సాయి, బెల్లం సత్యనారాయణ, టిడిపి నాయకులు హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, కండే శ్రీను, నరసింహాం, కూరపాటి శ్రీనివాస రావు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, తాళ్లూరు టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, మైనార్టీ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యదర్శి షేక్ పేద కాలేషా వలి (బడే), రాష్ట్ర యూత్ కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుండి నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.







ఎంపీ మాగుంటని నత్కరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రజా ప్రతినిధులు ……
ఎంపీ మాగుంటని నత్కరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రజా ప్రతినిధులు ……
ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి జన్మదిన పురస్కరించుకొని
దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీనీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం నర్పంచి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డిలు ముందస్తుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని నెల్లూరులో కలిసి పుష్పగుజ్జం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు విషయాలపై చర్చించారు .


ఎంపీ మాగుంటకు శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరు మండల టిడిపి నాయకులు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తాళ్లూరు మండలం నుండి అధిక సంఖ్యలో నాయకులు తరలివెళ్లి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డిని గజ మాలలతో ఘనంగా సత్కరించారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి ఒబులు రెడ్డి, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, నవులూరి విద్యాసాగర్, రాష్ట్ర మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ బడే కాలేషా వలి (బడే), రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, నాయకులు ఐవీ రమణా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కోనేటి వెంకట రావు, సొసైటీ అధ్యక్షుడు గొంది రమణా రెడ్డి (సమర), క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, పిన్నిక రమేష్, ఎన్ విద్యా సాగర్, కైపు రామ కోటి రెడ్డి, తిరుపతి రెడ్డి, సుధాకర్, లక్ష్మి నారాయణ, నారిపెద్ది కళ్యాణ్ చక్రవర్తి, పి రమణా రెడ్డి, పేరి రెడ్డి, ఆవుల ఆదినారాయణ, ప్రభాకర్ రెడ్డి నాదేండ్ల శ్రీను తదితరులు ఉన్నారు.

