ఓబీసీ కేనాల్లో చేపల వేటకు వెళ్లి గల్లతయిన వ్యక్తి మృతి చెందాడు. రెడ్డి సాగర్ వద్ద ఉ న్న నాగార్జున సాగర్ కెనాల్ లో పొదిలి మండలం కాటూరి వారి పాలెంకు చెందిన మెలిక ప్రసాద్ (40) ఆయన భార్య కొండమ్మతో వచ్చి చేపల వేట సాగిస్తూ మంగళవారం వల కాళ్లకు తగులు కోవటంతో బయటకు వచ్చే వీలు లేక నీళ్లలో గల్లంతయ్యాడు. ఆయన బంధువులు అందరూ కలసి వెతకగా మృత దేహాం ఎట్టకేలకు బుధవారం లభ్యమైనది. వీఆర్వో చిన్ని క్రిష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
