ప్రతిరోజూ జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను కలెక్టరేటుకు పంపించాలి – జిల్లా రిజిస్ట్రారును కలెక్టర్ పి.రాజాబాబు

  • స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
    -భూ ఆక్రమణలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసేలా ఈ వివరాలను పరిశీలించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేస్తానని కలెక్టర్ హామీ

      ప్రతిరోజూ జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను కలెక్టరేటుకు పంపించాలని జిల్లా రిజిస్ట్రారును కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకముగా సమీక్షించారు.
జిల్లాల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం, మన జిల్లాలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల వారీగా వచ్చిన ఆదాయం, రిజిస్ట్రేషన్ అనంతరం
ఆటో మ్యూటేషన్, నిషేధిత భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుతున్న తీరు, తదితర అంశాలను జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు కలెక్టరుకు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ గతంలో జిల్లాలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో జరిగిన భూ కుంభకోణంపై ఆరాదీశారు. తమ భూమి తమ ఆధీనంలోనే ఉన్నా వెబ్ ల్యాండులో ఇతరుల పేరు ఉన్నట్లు ‘ మీకోసం ‘ కార్యక్రమంలో ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ చెప్పారు. తప్పుడు రిజిస్ట్రేషన్ లపై సరైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినందున రోజువారీగా భూముల రిజిస్ట్రేషన్ల వివరాలను కలెక్టరేటుకు పంపించాలని ఆయన ఆదేశించారు. భూ ఆక్రమణలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసేలా ఈ వివరాలను పరిశీలించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ సిహెచ్.ఎన్.వరప్రసాదరావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మెరుగైన సేవలపై దృష్టి

         విపత్తుల నిర్వహణ - అగ్నిమాపక శాఖ, చేనేత - జౌళి శాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఖజానా శాఖ అధికారులతోనూ కలెక్టర్ సమీక్షించారు. మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ఆయా శాఖల అవసరాలు, నిధుల లభ్యతపై ఆరా తీశారు. డిఎంఎఫ్ నిధులనుంచి ఆర్థిక వనరులను సమకూరుస్తామని చెప్పారు. జిల్లా విపత్తుల నిర్వహణ - అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు రఘునంద , జిల్లా ఖజానా అధికారి జగన్నాధ రావు, జిల్లా క్రీడా అధికారి రాజరాజేశ్వరి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *