ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కళాశాలలు మరియు పాఠశాల తోపాటు ప్రధానమైన కూడలిలో యువకలతో పాటు విద్యార్థులకు పై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మత్తు పదార్థాల పై అవగాహన కార్యక్రమాలు జిల్లా పోలీసు లు నిర్వహిస్తున్నారు.
మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమించి ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ… పిల్లలు చదువుకుంటే వారి భవిష్యత్ బంగారు బాట అవుతుందని కష్టపడి డబ్బులు పంపుతున్నారని విద్యార్థులకు పోలీసు సిబ్బంది గుర్తు చేశారు.
మనం కాలేజీకు ఎందుకు వచ్చామని… కాలేజీకు వెళ్ళే ముందు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి రోజు ఒక్క క్షణం అలోచిస్తే… మీ లక్ష్యం మీ ముందు కనిపిస్తోందని గుర్తు చేశారు. అలా అలోచన చేసినప్పుడే… మీ లక్ష్యాలు మీకు కనిపిస్తాయని…అటు వైపు అడుగులు వేస్తారని విద్యార్థులకు తెలియచేసారు.
అంతేకాకుండా నిద్రలేవగానే… మిమ్ములను కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలా గుర్తు చేసుకున్నప్పుడు… వారి నడకలు, వారి అలోచనలు మంచివైపు ప్రయణిస్తాయని విద్యార్థులకు గుర్తు చేశారు.
అంతేకాకుండా వారి తల్లిదండ్రులు మాటలు విని చదువుకుంటే… వారి కన్న కలలను నెరవేర్చే వైపు అడుగులు వేస్తారన్నారు. మీ తల్లిదండ్రులు చెప్పన మాట ప్రకారం చదువుకుంటే..జిల్లా, రాష్ట్రం, దేశం గర్వించదగ్గ పౌరులుగా మిగిలిన పోతారన్నారు.
అదేవిధంగా సైబర్ నేరాలు, ఈ టీజింగ్ మరియు చట్టాలపై అవగాహన కల్పించాలి.
ఇదిలా ఉంటే.. ఈ మద్య కాలంలో కొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం కాలేజిలు వద్ద డబ్బు కోసం విద్యార్థులకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నార విద్యార్థులకు గుర్తు చేశారు
అలాంటి వాటికి అలవాటు పడి మీ బంగారు భవిష్యత్ నాశనం చేసుకొవద్దని పోలీసు సిబ్బంది విద్యార్థులకు సూచించారు. ఎప్పుడూ విద్యార్థులు వారి లక్ష్యం వైపు ప్రయణించాలి… కాని చేడు వ్యసనాలు వైపు కన్నెత్తి చూడ కూడదని.. విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
మీ తోటి విద్యార్థులు చేడు వ్యసనాలకు బానిసలు అవుతుంటే… మనకేందుకులే అని ఎవరు అనుకోవద్దన్నారు. అలా ప్రతి ఒక్కరూ అనుకుంటే… మీరు కూడా అందులో భాగస్వామ్యులు అవుతారన్నారు.
చేడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న వారిని… మంచి మార్గంలో పెట్టాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపైన ఉందని విద్యార్థులకు గుర్తు చేశారు.
కాలేజిలు వద్ద కాని స్కూల్స్ వద్ద కాని విద్యార్థులు భవిష్యత్ నాశనం చేస్తున్న మత్తు పానీయాలు కాని, మత్తుపదార్థాలు కాని విక్రయిస్తే.. వేంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కాని లేకపోతే.. డయల్ 112 కు కాని ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు
సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచామని ప్రజలకు, విద్యార్థులకు తెలియజేశారు.
డబ్బు కోసం మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ప్రతి ఒక్కరూ… మత్తు పదార్థాలు సేవించే వారిలో మీ బిడ్డలు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి అలోచించాలన్నారు.
డబ్బు కోసం విద్యార్థి జీవితాలను బలంగా పెట్టవద్దని మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న వారికి పోలీసులు విజ్ఞప్తి చేయడమైనది.
డబ్బు కోసం ఎదైన వృత్తిని ఎంచుకొవాలేకాని… తల్లిదండ్రులు గర్భంశోకానికి గురికావద్దని తెలియచేసారు
విద్యార్థులకు మత్తు పానీయాలు కాని, మత్తు పదార్థాలు కాని విక్రయించేవారిపట్ల పోలీసులు వారు నిరంతరం నిఘా పెడుతున్నామని తెలియచేసారు.
మత్తు పదార్థాలు విక్రయించే వారు ఎంతటివారైన, వారి వెనుక ఎంతటి వారుఉన్న ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు.


