పసుపు గల్లులో వైభవంగా బొడ్డు రాయి గమిడిరాళ్ల ప్రతిష్ట మహోత్సవం

ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో శ్రీ సీతలాంబ( బొడ్డు రాయి), గమిడి రాళ్ల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం లో మహా కుంభాభిషేకం మహోత్సవ , సహిత శ్రీ చక్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు భక్తుల కోలహాల మధ్య వైభవంగా నిర్వహించారు. పసుపుగల్లు గ్రామం తో పాటు చుట్టుపక్కల మండలాల నుండి, గ్రామాల నుండి భక్తులు, , బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గమిడి రాళ్ల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల కోలాహలం మధ్య అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైకాపా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆయా పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు
అనంతరం భక్తులకు, గ్రామస్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రత్యేక పూజలు చేస్తున్న డాక్టర్ బూచేపల్లి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయ్యమ్మ లు

ప్రత్యేక పూజలు పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *