హైదరాబాద్ అక్టోబర్ 16(జే ఎస్ డి ఎం న్యూస్) :
కిమ్స్ ఆస్పత్రులు అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఫార్మార్ట్ – కిమ్స్ ఫెర్టిలిటీ & ఐ వీ ఎఫ్ సెంటర్‌ను బంజారాహిల్స్‌లో ప్రారంభించాయి. ఆధునిక ఆరోగ్య సేవల విభాగంలో మరో కీలకమైన అడుగుగా నిలిచిన ఈ కేంద్రం, తల్లిదండ్రులు కావాలనుకునే దంపతులకు ప్రిమియర్-గ్రేడ్ రీప్రొడక్టివ్ కేర్ మరియు సహానుభూతితో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థాపించారు. బంజారాహిల్స్ లోని కిమ్స్ ఫెర్టిలిటీ & ఐ వీ ఎఫ్ సెంటర్ ను. డా. బి. భాస్కర్ రావు, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్ ఆస్పత్రులు; డా. ఏ.వి. గురవారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రులు; డా. సుధాకర్ జాధవ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రులు; డా. నిమ్మ పూజా రెడ్డి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ & లాపరోస్కోపిక్ సర్జన్; మరియు డా. సిందూరా బండి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ & రీప్రొడక్టివ్ రీజెనరేటివ్ మెడిసిన్ నిపుణులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్ హాస్పిటల్స్ డా. బి. భాస్కర్ రావు మాట్లాడుతూ ఆధునిక ఫెర్టిలిటీ & ఐ వీ ఎఫ్ సెంటర్‌ను ఆవిష్కరించడంలో ఎంతో ఆనందంగా ఉందని. తల్లిదండ్రులు కావాలనుకునే దంపతులకు అత్యుత్తమ రీప్రొడక్టివ్ కేర్ మరియు సహానుభూతి ప్రధానమైన మద్దతు అందించడం మా లక్ష్యం. కిమ్స్‌లో, మేము వైద్య నిపుణతను నమ్మకం మరియు మానవత్వంతో కలిపి అందిస్తున్నామని తెలిపారు.
, మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, డా. ఏ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ కిమ్స్ ఫెర్టిలిటీ ఐ వీ ఎఫ్ సెంటర్లో దంపతులు విస్తృత శ్రేణి ఫెర్టిలిటీ చికిత్సలను పొందవచ్చు అని తెలిపారు. సెంటర్ లో లేజర్-అసిస్టెడ్ ఎంబ్రియో హ్యాచింగ్ మరియు ప్రీ-ఇంప్లాంటేషన్ జనెటిక్ టెస్టింగ్ (పి జీ టి) వంటి అత్యాధునిక విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మైక్రోఫ్లూయిడిక్స్, ఎం ఏ సి ఎస్ ,టీ ఈ ఎస్ ఏ టి ఈ ఎస్ ఏ, వంటి ఆధునిక పరీక్షలు మరియు చికిత్సలు అందించబడతాయి. అదనంగా, సెక్సువల్ డిస్‌ఫంక్షన్ మరియు సంబంధిత సమస్యల కోసం ప్రత్యేక క్లినిక్‌లు కూడా ఏర్పాటు చేశారు.
గైనకాలజీ విభాగంలో లాపరోస్కోపిక్ మరియు హిస్టెరోస్కోపిక్ శస్త్రచికిత్సలలో నైపుణ్యం కలిగి ఉంది. భవిష్యత్తులో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు. అదనంగా, పి ఆర్ పి (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా), ఓవేరియన్ స్టెమ్ సెల్ థెరపీ, మరియు ఇమ్యూనోథెరపీ వంటి సరికొత్త చికిత్సా పద్ధతులు కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి, వీటివల్ల వైద్య ఆధునికత మరియు మానవీయత కలిసిన సమగ్ర సేవలుఅందించబడుతున్నాయి.

