బేగంపేట అక్టోబర్ 16(జే ఎస్ డి ఎం న్యూస్)
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ వద్ద పెరిగిన మొక్కలను ఎప్పటి కప్పుడు తొలగించాలని ,ట్రాన్స్ ఫార్మర్స్ కింద చెత్త ను వేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను కోరారు.బేగంపేట డివిజన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ , తాతాచారి కాలనీ లలో గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజీ టోచర్,విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు.విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ వేసిన ఫెన్సింగ్ పాడై పోయిందని,ఆ ప్రాంతంలో మొక్కలు దట్టంగా పెరిగిపోయాయని దీంతో ప్రమాదం పొంచి వుందన్నారు.కంచె లేని ప్రాంతాలను గుర్తించి కొత్త గా కంచె వేయాలన్నారు.అలాగే కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్స్ ను ఎత్తు పెంచి పెట్టాలన్నారు.ట్రాన్స్ ఫార్మర్ల కింద చెత్త చెదారం వేయరాదన్నారు.సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమం లో టి జి ఎస్ పి డి సి ఎల్ డి ఈ భీమ్ నాయక్, ఏ ఈ సాయికుమార్.సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజీ టోచర్ ప్రవీణ్ ,సున్నం రాజు,పేపర్ శేఖర్ తదితరులు ఉన్నారు.


