హైదరాబాద్ అక్టోబర్ 16
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ మైదానంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ స్థూపం నిర్మాణ పనులను డిజిపి బి.శివధర్ రెడ్డి గురువారం పరిశీలించారు .
అక్టోబరు 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమం గోషామహల్ స్టేడియంలో నిర్వహిస్తున్న విషయం విధితమే. కార్యక్రమంలో భాగంగా స్తూపం నిర్మాణ పనులను డిజిపి, హైదరాబాద్ పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమములో డి జి పి వెంట అదనపు డిజిపి
(లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం భగవత్ , హైదరాబాద్ సి.పి వి.సి సజ్జనర్, తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి. ఎం.రమేశ్ , శాంతి భద్రతల జాయింట్ సిపి , హైదరాబాద్ సిటీ .తఫ్సీర్ ఇక్బాల్ , జాయింట్ సిపి ట్రాఫిక్ .జోయల్ డేవిస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


