బీసీ వసతి గృహాలలోని వసతి పొందుతున్న విద్యార్థులకు మోను ప్రకారం బోజనం, పరిశుద్ధమైన నీటిని అందించాలని బీసీ వెల్ఫేర్ ఎక్కో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ సత్యనారాయణ అన్నారు. ఒంగోలు పీజిఅర్ సమావేశపు మందిరంలో గురువారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని బీసీ సంక్షేమ వసతి గృహా అధికారులకు సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా బీసీ వెల్ఫేర్ ఎక్క్సో ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ వసతి గృహాలలో కలుషిత నీరు లేకుండా వాటర్ ట్యాంక్లను శుభ్రం చెయ్యాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా కాచి చల్లార్చిన సురక్షితమైన నీరు అందించాలని, మోను ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వసతి గృహాల నాణ్యతను బట్టి మంచి ఫర్ఫార్మెన్స్ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ను వసతి గృహాల సంక్షేమ అధికారులకు మార్క్స్ కేటాయించి ఆగష్టు నుండి అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, ఎంజె పీ ఏ పి బిసీ డబ్యు ఆర్ ఎస్ సెక్రటరీ మాధవి లత, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు ఎస్ నిర్మల జ్యోతి , వెంకట లక్ష్మి, ఆయా జిల్లాల సంక్షేమ వసతి గృహాధికారులు, ఎంజె పీఏ ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పూల మాల లు వేసి నివాళులు అర్పించారు.



