ప్రభుత్వం గత 15 రోజులుగా వైద్యుల సమస్యలపై స్పందించకుండా ఉంటే వైద్యులు లేక వైద్యశాలకు వస్తున్న రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని తూర్పుగంగవరం పీహెచ్సీ హెచ్ఐఓ కె చంద్రశేఖర్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. పీహెచ్సీ వద్ద శుక్రవారం వైద్య సిబ్బంది నల్ల రిబ్బర్లు ధరించి నిరసన తెలుపుతూ విధులకు హాజరు అయ్యారు. వైద్యుల న్యాయ బద్దమైన కోరికలు పీజీలో సీట్ల కేటాయింపు వంటి సమస్యలు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పరిష్కరించాలని కోరారు.
