చీరాల నుండి సూళ్లూరుపేట వరకు విస్తరించి ఉన్న వాసవి జిల్లా 205 లోని 70క్లబ్స్ ద్వారా ఈ 2025 సంవత్సరంలో సమాజ సేవలు విస్తృతంగా జరుగుతున్నాయని, లక్షలాది రూపాయల విలువైన సేవలు సమాజానికి అందించడం జరుగుతు ఉన్నదని వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ చుండూరి గాయత్రి పేర్కొన్నారు. శుక్రవారం వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనువాసులు నేతృత్వంలో స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవస్థానంలో జరిగిన సేవా కార్యక్రమాల పర్యవేక్షణకు తమ అధికార పర్యటనలో వాసవి జిల్లా గవర్నర్ చుండూరు గాయత్రి మరియు క్యాబినెట్ కార్యదర్శి మార్టూరి రాఘవేంద్రరావులు విచ్చేశారు.
కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవికి సారె సమర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, పలువురికి నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా క్యాబినెట్ కార్యదర్శి మార్టూరు రాఘవేంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, స్వర్గీయ కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా ఆర్య వైశ్యుల అభివృద్ధికి, వితంతువులు ఎవరి మీదా ఆధారపడకుండా వారి స్వంత కాళ్లపై వారు నిలబడే విధంగా… ఆర్థిక ఉన్నతి సాధించడానికి 1961 సం.లో వాసవి క్లబ్స్ స్థాపించారని, ఆర్య వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉన్న వాసవి క్లబ్స్ ద్వారా కులమతాలకు అతీతంగా సేవలు నిర్వహించడం జరుగుతుందని వాసవి క్లబ్ ప్రస్థానాన్ని వివరించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ నేతృత్వంలో రోజుకు ఒక కాన్సెప్ట్ తో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతు ఉన్నదని, ఉదయాస్తమ సేవలు, వాసవి వారోత్సవాలు మరియు కేలండర్ ఆఫ్ ఈవెంట్స్ ను వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ప్రతి సందర్భాన్ని సేవగా పలుచుకొని కార్యక్రమాలు నిర్వహించారని క్లబ్ కార్యవర్గ సభ్యులను అభినందించారు.
కార్యక్రమంలో… వాసవి క్లబ్ బోంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు నీరద దంపతులు, కార్యదర్శి మద్దాలి శివ ప్రసాద్ రావు, కోశాధికారి బియ్యపు సంపత్ కుమార్, జిల్లా అధికారులు తుమ్మపూడి ఏడుకొండలు, రీజన్ చైర్మన్ చలువాది సత్యనారాయణ, రంగస్వామి, జి. రంగనాథ్, అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కే హరిప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు రాధా రమణ గుప్తా జంధ్యం, గుర్రం కృష్ణ, చీమకుర్తి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




