బేగంపేట అక్టోబర్ 18(జే ఎస్ డి ఎం న్యూస్) :
అధికారుల నిర్లక్ష్యం మరో ప్రమాదానికి కారణమైంది.తాజాగా సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ బేగంపేట ప్రకాశం నగర్ ఫ్లై ఓవర్ పిల్లర్ ను డీ కొట్టింది.దీంతో కంటైనర్ సగభాగం చీలిపోయింది.కంటైనర్ లో ఉన్న వస్తువులు అన్ని రోడ్డు పైన పడిపోయాయి.దీంతో కొంత ట్రాఫిక్ కు అంత రాయం కలిగింది.గమనించిన వాహనదారు లు తమ వాహన వేగాన్ని నియంత్రించడంతో ప్రమాదాలు జరగలేదు.ఇక్కడే యూ టర్న్ కూడా ఉండటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.ప్రతి సారి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నా వాహన దారులను అప్రమత్తం చేయడంలో అధికారులు వైఫల్యం చెందారు అని స్పష్టంగా పేర్కొనవచ్చు.బేగంపేట ప్రధాన రోడ్డులో ఉన్న ప్రకాష్ నగర్ ఫ్లై ఓవర్ కింద రెండు మూడు పిల్లర్లు తక్కువ ఎత్తులో ఉంటాయి.అయితే ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారులు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు సూచిక బోర్డు లు ఏర్పాటు చేసి తెలియ జేయాలి.అయితే ఫ్లై. ఓవర్ ప్రారంభం లో ఎలాంటి (ఫ్లై ఓవర్ పిల్లర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయి.ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ) హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లయితే వాహన దారులు ఇది గుర్తించే అవకాశం ఉంటుంది.ఇక్కడ బోర్డు లు ఏర్పాటు చేయక పోవడం.పిల్లర్లకు ప్రమాదాన్ని తెలియ జేసేలా ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేయక పోవడంతో తరచూ ప్రకాశం నగర్ ఆంధ్రాబ్యాంక్ ముందు రెండు వైపులా(సికింద్రాబాద్,అమీర్ పేట)వెళ్ళే వైపు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సంబంధిత శాఖ ఉన్నతాది కారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తుంది.ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అదే ఉదయం సమయంలో అయితే రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది.అని వాహనదారులు పేర్కొన్నారు.
ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముందే హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలి…….
ప్రకాశం నగర్ ఫ్లై ఓవర్ ప్రారంభంలో రెండు వైపులా ఇక్కడ ఫ్లై ఓవర్ పిల్లర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయి.ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ సూచిక బోర్డు లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వాహన దారులు కోరుతున్నారు.
గతంలోనూ అనేక ప్రమాదాలు….
ఈ ఫ్లై ఓవర్ కి రెండు వైపులా గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి.అయితే గాయాలతోనే బయట పడిన ఘటనలు ఉన్నాయి.ఒక పాఠశాల కు చెందిన బస్సు పిల్లర్ ను ఢీ కొన్న ఘటనలో బస్సులో ఉన్న విద్యార్ధులకు గాయాలయ్యాయి.మరో ఘటనలో ఆర్ టీ సి బస్సు పిల్లర్ ను డీ కొట్టడంతో బస్సు పై కప్పు లేచిపోయింది.ఈ ఘటనలో ప్రయాణీకులకు గాయాలు కాక పోవడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పటి కైనా అధికారులు స్పందించి ఈ ఫ్లై ఓవర్ కి ఇరు వైపులా ప్రమాదాలు జరిగే స్తలం పిల్లర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయి అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లయితే ప్రమాదాలు కొంత నివారించే అవకాశం ఉంటుందని స్థానికులు,వాహన దారులు కోరుతున్నారు.

