పత్రికా స్వేచ్ఛ కాపాడాలని కోరుతూ నియోజకవర్గంలోని జర్నలిస్టులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ శ్రీ చరణ్కు వినతివ్రతం అందజేశారు. మద్యం అక్రమాలపై వార్త కథనానికి సబంధించి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు సాక్షి జిల్లా కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఆధారాలు ఇవ్వాలని బెందింపులకు పాల్పడటంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి, తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాస్తవాలు రాస్తున్న పాత్రికేయులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని, పాత్రి కేయులన పోలీసులతో బెదిరించి వార్తలు రాయకుండా చేసే విధంగా చేస్తోంద న్నారు. సాక్షి ఎడిటర్ పై పెట్టిన కేసులు ఎత్తివేసి, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నరిశెట్టి నాగేశ్వరరావు, దాసు, సంగయ్య, రావుట్ట శ్రీనివాసరావు, జి. ఆంజనేయులు, చంద్రయ్య, చిరంజీవి, అనిల్, సోమ శ్రీనివాసరావు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.
