హైదరాబాద్ అక్టోబర్ 18(జే ఎస్ డి ఎం న్యూస్)
సమాజం లో మేము ఎంతో మాకు అంత 42శాతం బి సి రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు కావేరి శేఖర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.శనివారం బీ సి రిజర్వేషన్లు కోసం బీ సి సంఘాలు తదితరులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు శేఖర్ ముదిరాజ్ మద్దతు ప్రకటించారు.బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ బంద్ లో భాగంగా సంఘీభావంగా తెలంగాణ రాష్ట ఐ ఎన్ టి యు సి నాయకులు, కావేరి శేఖర్ ముదిరాజ్. ఆధ్వర్యంలో అప్ప రేల్ ఎక్స్పోర్ట్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు,మండల కాంగ్రెస్ నాయకులు, మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొని నిరసన తెలియ జేశారు. సమాజంలో మేమెంతో మాకంత అనే నినాదంతో తలపెట్టిన 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు మరియు సబ్బండ వర్ణాలు తెలంగాణ బందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్మికులు రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు, కావేరి శేఖర్ ముదిరాజ్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ఓబీసీ సెల్ అధ్యక్షులు బట్టికాడి విజయకుమార్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్, మాజీ సర్పంచులు,బండారి నరేందర్ ముదిరాజ్, భేరే ఈశ్వర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు దొడ్ల మోహన్ ముదిరాజ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకులు అమరం సురేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నవీన్ కుమార్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు జైత్వాల మహేందర్, ఐ ఎన్ టి యు సి నాయకులు రమేష్ మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


