జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు- బిజెపి జిల్లా మీడియా ఇన్చార్జి ధనిశెట్టి రామునాయుడు.

      చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ దీపావళి దీపాలు వరుసలతో సుందరంగా అలంకరించిన గృహసీమ లలో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. కుమారుడు తప్పు చేసిన దండించవలసిన మొదటి గురువు అమ్మ. అమ్మ స్థానంలో ఉన్న సత్యభామ నరకుని వధించుట చారిత్రక ఘట్టం. ప్రస్తుత సమాజంలో విచ్చలవిడిగా తోటి ప్రజలకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఇబ్బందులు కలిగించే కడుపున పుట్టిన కుమారుడినైనా దండించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన నాడు సమాజానికి ఉన్నతమైన లక్షణాలు కలిగిన పుత్రులను అందించిన వారు అవుతారని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ దనిశెట్టి రామునాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో
అరమరికలు లేక సోదర భావంతో జీవించాలని ప్రతి ఇల్లు దీప కాంతులతో ప్రకాశించాలని దనిశెట్టి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *