బేగంపేట అక్టోబర్ 20 (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట దేవనార్ అంధుల పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా టీ పీ సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంధ విద్యార్థుల తో కలిసి పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అంధుల కోసం డాక్టర్ సాయిబాబా గౌడ్ దేవనార్ అందుల పాఠశాల స్తాపించారని అన్నారు.పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ రంగాల్లో తమ సత్తా చాటు తున్నారు అని అన్నారు.రాష్ట్రం తో పాటు వివిధ దేశాల్లో కూడా వారి ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతూ పాఠశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకు రావడాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు. ఈ వేడుకలలో దేవనార్ అంధుల పాఠశాల చైర్మన్ సాయిబాబా గౌడ్, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజీ టోచర్,గౌరపల్లి రమేష్,విశాల్ సుధాం,రమాదేవి,నసీరుద్దీన్ (అడ్డూ)నాయకులు,కార్యకర్తలు,విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.



