ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి దర్శిలోని తన నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజలు చేసిన అనంతరం ప్రజా ప్రతినిథులు, అభిమానులలో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లాలో పార్టీ పదవులు పొందిన పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు. వైసీపి దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, కౌల్సిలర్లు మేడగం మోహన్ రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు కేసరి రామ్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తిలో బీవిఎస్ ఆర్ నివాసంలో డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నందిని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలతో కలిసి ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారు.








