సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విశేష కృషి చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ రాజాబాబు మంగళవారం అభినందించారు.
” ధర్తీ ఆభా జనభాగీదారీ అభియాన్ ” పథకంలో భాగంగా గిరిజన హక్కుల పరిరక్షణ, గృహ నిర్మాణము, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విశేష కృషి చేసినందుకు ప్రకాశం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 17న ప్రత్యేక అవార్డు ఇచ్చింది. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్ మంగళవారం ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును కలిసి అవార్డు ప్రధానోత్సవం గురించి వివరించారు.
జిల్లాకు అవార్డు వచ్చేలా పనిచేసినందుకు వారిని కలెక్టర్ వారిని అభినందించారు.
