భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసారు. పలు శాఖల అధికారులు కంట్రోల్ రూమ్ నుండి విధులు నిర్వహిస్తూ ఆ ప్రాంతాలలో వర్షాల ప్రభావంపై ఆరా తీస్తూ సంబంధిత అధికారులకు తగిన సమాచారాన్ని అందిస్తున్నారు.
