వైఎస్సార్ సీపీలో నూతనంగా జిల్లా పదవులలో నియమితులైన బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ, సర్పంచ్ చిమట సుబ్బారావు, జిల్లా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొజ్జ సంజీవకుమార్, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డిలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను వారి నివాసంలో మర్యాద పూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా వారిని నాయకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు బూచే పల్లి సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు టి. వి సుబ్బారెడ్డి, యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు
లోకిరెడ్డి గోవిందమ్మ వెంకటేశ్వరరెడ్డి, నాయకులు గొల్లపూడి యర్రయ్య, కొర్రపాటి సుబ్బారావు, అడకా సుబ్బా రావు పాల్గొన్నారు.
