అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన మండలంలో ప్రధాన వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దోర్నపు వాగు ప్రహహించే ప్రాంతాలలో ఎస్సై మల్లిఖార్జున రావు ఆదేశాలలో పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గమనిస్తున్నారు. తాళ్లూరు, విఠలాపురం మధ్య తాళ్లూరు, రజానగరం మధ్య దోర్నపు వాగు ఉదృతిని గమనిస్తూ రాక పోకలు సాగించటానికి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. తాళ్లూరు- ముండ్లమూరు ప్రధాన రహదారిలో పోలీన్ కానిస్టేబుల్ బాబు రావు, రజానగరం రోడ్లో పోలీస్ కానిస్టేబుల్ మాలకొండయ్య లు వాగు ఉదృతిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరుసవర్షాలలో ఇప్పటికే గుంతల మయం అయిన రోడ్లలో వాహనాలు తిరగాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఠలాపురం రమణాల వారి పాలెం రోడ్లో లారీ గుంతలలో కూరుక పోయి రోడ్లు బ్లాక్ అయినది. ప్రొక్లయిన్ సహాయంతో లారీని తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు గ్రామాలలో సైడు కాలువలు లేకుండా నీసీ రోడ్లు వేసిన చోట నీరు ఎక్కడికక్కడ నిలబడి పోయి ప్రజలు రాక పోకలు సాగించటానికి ఇబ్బందికరంగా తయారు అయినది.
నాల్చుడు వానకు పంటలకు రక్షించుకోవాలి………
నాల్చుడు వానకు పంటలకు రక్షించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. పంట చేతికి వచ్చే సమయంలో వరి ఒదేలు, నజ్జ పొలంలో ఉన్నట్లయితే 5శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారిచేసుకోవాలని కోరారు. రమణాల వారి పాలెం, కొత్త పాలెం, తురకపాలెంలో పొలాలను పరిశీలించి మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.




