ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శాగం కొండా రెడ్డి సేవలు మరువలేనివని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు లు కొనియాడారు. వెలుగు వారి పాలెంలో బుధవారం ఆయన సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. శాగం కొండా రెడ్డి చిత్రపటానికి డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ కడియాల, నారపుశెట్టి లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన భార్య, కుమార్తెలను పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర), దరిశ మండల పార్టీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, సంగా తిరుపతి రావు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.


