ఒంగోలు వైద్య కళాశాల విద్యార్థులు రాష్ట్రంలో అన్ని కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఒంగోలు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ పిలుపు నిచ్చారు. ఒంగోలు లో జీఎంసీ ఆడిటోరియంలో గురువారం వైట్ కోట్ వేడుక, ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మంచి వైద్యులుగా రాణించగలరని చెప్పారు. జిజి హెచ్ సూపరిండెంట్ డాక్టర్ మాణిక్యా రావు మాట్లాడుతూ మంచి క్రమశిక్షణ తో ఎదగాలని చెప్పారు. లక్షలలో పోటీ పడితే డాక్టర్ అయ్యే అదృష్టం కొందరికే దక్కుతుందని తెలిపారు. డిప్యూటి సూపరిండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంపై మన ప్రభావం అధికంగా ఉంటుందని కాబట్టి ప్రతి విషయంలోను జూగూరతో వ్యవహరించాలని కోరారు.
సమాజంలో ఆదర్శంగా నిలవాలి …. సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అధారిటీ షేక్ ఇబ్రహీం…
సమాజంలో అదర్శంగా నిలవాల్సిన విద్యార్థులు విపరీత ధోరణులకు ఆకర్షణీయులు కావద్దని, ర్యాగింగ్ రుగ్మతకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అధారిటీ షేక్ ఇబ్రహీం కోరారు. ఒంగోలు వైద్య కళాశాల వైద్య విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అధారిటీ షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ జీవితాలను తలక్రిందులు అయ్యే విధంగా ప్రవర్తించవద్దని హితవు చెప్పారు. యాంటీ ర్యాగింగ్, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఒంగోలు డీఎస్పీ రాయ పాటి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు. ఒక సారి కేసు నమోదు అయితే భవిష్యత్ నాశనం అవుతుందని వివరించారు.


