భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి గురువారం సాయంత్రం నాగులుప్పలపాడు మండలం, చదలవాడ గ్రామాన్ని సందర్శించి, చదలవాడ రామన్న చెరువు గట్టు దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించారు. చెరువులోని నీరు ఒంగోలు – చీరాల జాతీయ రహదారి పైకి రాకుండా ఉన్న సైడు కాలువ ద్వారా వెళ్ళేలా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నేషనల్ హై వే అధారిటి, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే సైడు కాలువలో నిలిచి ఉన్న నీటిని తొలగించి, గుండ్లకమ్మ వాగు వైపు నీటిని సరైన విధంగా మళ్లించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. నేషనల్ హై వే అధారిటి ఇంజనీరింగ్ అధికారులు వెంటనే జెసిబి ని ఉపయోగించి పనులను ప్రారంభించారు. చెరువు కట్టను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఇదే సమస్య వస్తున్నదని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, ఇరిగేషన్ ఎస్ ఈ వరలక్ష్మి, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.



