హైదరాబాద్ అక్టోబర్ 24(జే ఎస్ డి ఎం న్యూస్) :రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేయడం అభినందనీయమని డిజి స్వాతి లక్రా అన్నారు తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం టిజిఎస్పిఎఫ్ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిమ్స్ ఆసుపత్రి సహకారంతో టీజీఎస్పీఎఫ్ ఆరోగ్య భద్రత వారి ఆధ్వర్యంలో సవివాలయంలో రక్తదారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఆరోగ్య భద్రత సెక్రటరీ ఎన్ త్రినాథ్ రక్తదాన శిబిరంలో పాల్గొనే రక్తదానం చేశారు ఈ సందర్భంగా డిజి స్వాతిలక్కర మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్తదానం చేయడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు ముందు ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ రక్తదాన శిబిరంలో తెలంగాణా సెక్రటేరియట్ సి ఎస్ ఓ దేవీదాస్ , ఏ సి పి బాబురావు,డీఐజీ ఆర్ ఆర్ మాధవరావు సి జంగయ్య అప్పాజీ ,సిహెచ్ పవన్ కుమార్, తిరుపతి ,ఇన్స్పెక్టర్ సన్యాసిరావు ,ఎస్.కె మౌలాలి, సత్తయ్య ,తిరుపతి ,భాస్కర్, శ్రీధర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి ఎస్ఐలు ఏఎస్ఐలు పాల్గొన్నారు.



