జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రములు, పట్టణ ఆరోగ్య కేంద్రముల లో పనిచేయు వైద్యాధికారులు పర్యవేక్షణ , ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్య కర్తలు అందరూ భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు కోరారు.
తీరా ప్రాంతాల్లో ఉండే గర్భిణీ స్త్రీ లను, వృద్ధులను , పిల్లలను పునరావాస కేంద్రాలకు పంపాలని చెప్పారు . వారికి ఆరోగ్య పరీక్షలు చెయ్యాలని తెలిపారు. గ్రామాలను ఆరోగ్య సిబ్బంది పర్యటించి ఆరోగ్య సమస్యలను గుర్తించాలని, మంచినీటి వనరులను కలుషితం కాకుండా చూడాలని, దోమలవల్ల వచ్చే వ్యాధులు గురించి ప్రజలకు తెలియజేసి వ్యాధినిరోధక కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందుల యొక్క నిల్వలను సరిపడా ఉండేవిదంగా చూసుకోవాలని కోరారు. గ్రామ , పట్టణాలలో అంటురోగాలు ప్రభలకుండా చూడవలసిన బాధ్యత ఆరోగ్య సిబ్బంది పై ఉన్నదని తెలిపారు. ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేయాలనీ తెలిపారు.
జిల్లాలోని అన్ని డివిజన్ ల లోని ప్రోగ్రాం అధికారులు వారి డివిజన్ ల లోని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు పట్టణ ఆరోగ్య కేంద్రముల నుండి సమాచారం సేకరించాలని , గ్రామాలు సందర్శించాలని ఆదేశించారు.
ఆరోగ్య సిబ్బంది ప్రతి ఒక్కరు వారివారి హెడ్ క్వార్టర్ లో ఉండి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకొని పై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
