అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం ఉదయం వేళ ముసురు పట్టటంతో జిల్లా విద్యాశాఖాధికారి సైతం పాఠశాలకు సెలవుగా ప్రకటించారు. అయితే మధ్యాహ్న సమయంలో తెరపి ఇచ్చి ఎండ రావటంతో ఒక్కసారిగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో 6.4 మి.మీల మేర శుక్రవారం ఉదయం వరకు వర్షం నమోదు అయినది. దీంతో పలు గ్రామాలలో సైడు కాలువలు సక్రమంగా లేక రోడ్లు వాగుల వలే దర్శన మిస్తున్నాయి. ప్రధాన వాణిజ్య కేంద్రం తూర్పుగంగవరంలో ఆంజనేయ స్వామి గుడి మలుపు తర్వాత సీసీ రోడ్డు ముగిసిన వెంటనే పెద్ద తటాకం వలే రోడ్డులో నీరు నిలిచి వాహన దారులకు, ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మండలంలో ప్రధాన వాగుల ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాలలో పోలీసులు తమ సిబ్బందితో పర్యవేక్షణ చేయిస్తున్నారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కొర్ర పాటి వారి పాలెం, శివ రామపురం గ్రామాలలో పంటలను పరిశీలించి తగిన సూచనలు చేసారు.



