పిజి పరీక్ష ఫలితాలలో శ్రీహర్షిణి విద్యార్థుల ప్రభంజనంఫోటో. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు

ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో జరిగిన పీజీ పరీక్ష ఫలితాలలో శ్రీహర్షిణి పీజీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో మంచి మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని శ్రీహర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. ఎం ఎస్ సి కెమిస్ట్రీ విభాగంలో కొల్లి హేమ, సిహెచ్ మహిత 8.6/ 10 తో యూనివర్సిటీ ప్రథమ స్థానాన్ని సాధించారు. 48 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 43 మంది ప్రధమ శ్రేణి ఉత్తీర్ణత సాధించారు. ఎం ఎస్ సి ఫిజిక్స్ విభాగంలో గుంటుపల్లి నాగరాణి 7.84/10 తో యూనివర్సిటీ ప్రథమ స్థానాన్ని, రావులపల్లి మౌనిక 7.63/10 తో రెండవ స్థానాన్ని సాధించారు. ఎం ఎస్ సి కంప్యూటర్ విభాగంలో కే యామిని 8.9/10 తో ప్రథమ స్థానాన్ని, కే వెంకట కీర్తి 8.79/10 తో ద్వితీయ స్థానాన్ని సాధించారు. కంప్యూటర్స్ విభాగంలో 65 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 64 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఎంఎస్సీ . గణిత విభాగంలో గోకతోటి పుష్పలత 8.76/10 తో ప్రథమ స్థానాన్ని, తుళ్ళి బల్లి సంపత్ ,8.6/10 తో ద్వితీయ స్థానాన్ని సాధించారు. గణిత విభాగంలో 30 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 29 మంది ప్రధమ శ్రేణి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో శ్రీహర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా పరిధిలో పిజి క్లాసులను క్రమం తప్పకుండా ప్రతిరోజు క్లాసులు నిర్వహిస్తూ ఉన్న ఏకైక కళాశాల శ్రీ హర్షిణి అని తెలియజేసే తెలియజేశారు అందుకే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో అత్యధిక మంది శ్రీహర్షిణీలో చేరుతుంటారు అని తెలియజేశారు. పీజీ చేరిన విద్యార్థులకు కూడా ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీహర్షిణి తెలియజేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డీన్ దాది. ఆంజనేయులు , అధ్యాపక సిబ్బంది సుబ్బారావు, బాబు సార్, సలోమన్,రవి కాంత్ రెడ్డి,మరియు క్యాంపస్ ఇంచార్జ్ ప్రతాప్ , ధిరీష్, శివకుమార్, ఇతర సిబ్బంది పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *