జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శనివారం కొంత శాంతించాయి. జిల్లాలో ఒంగోలు అర్బన్, రూరల్, కొత్త పట్నం, సంతనూతల పాడు, కొండేపి, పామూరు, కనిగిరి, పామూరు, రాచర్ల, కంభం, కొమరోలు, వెలిగండ్ల, పొదిలి, పొన్నలూరు, చీమకుర్తి, టంగుటూరు, గిద్దలూరు, మర్రిపూడి, బేస్తవారి పేట, జరుగుమల్లి, టంగుటూరు, గిద్దలూరు, బేస్తవారి పేట, మద్దిపాడు, కొనకన మిట్ట, మార్కాపురం, తర్లుపాడు, నాగులుప్పల పాడు, అర్ధార వీడు, పెద్దార వీడు, దొనకొండ, త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు, పుల్లల చెరువు, కురిచేడు, ముండ్లమూరు లలో మాత్రమే శనివారం సరాసరి 12.2 మి.మీల వర్షపాతం నమోదు అయినది. వాతావరణ శాఖ మరో తుఫాన్ ఉందన్న హెచ్చరిక నేపధ్యంలో జిల్లా కలెక్టర్ రాజా బాబు అధికారులను అప్రమత్తం చేసారు. ఈనెల 21 నుండి 25 వరకు జిల్లాలో సరాసరి 124.2 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లయినది.
