ఒంగోలు కలెక్టరేట్ డిఆర్వో చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో శనివారం డిఆర్ఓ ఓబులేసు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి నామినేషన్ వేసి పోటీలో ఉన్న ఏకగ్రీవం జరగదని తెలిపారు .ఎలక్షన్ జరుగుతుందని, పోటీలో ఉన్న అభ్యర్థి ఓటరుకు నచ్చక పొతే తన ఓటును నోటకు వేసుకునే అవకాశం కొత్తగా పెట్టిన నిబంధనలను ఓటరు కు అవగాహన కల్పించారని తెలిపారు. రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకుని, మీరు నివాసం ఉన్న చోట మాత్రమే ఓటును కలిగి వుండాలని వెంటనే రెండవ ఓటు ను తొలిగించుకోవాలని ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకొని వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు .18 సంవత్సరలు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు, జిల్లా లో చనిపోయిన వారి ఓట్లను వెంటనే ఓటరు లిస్టు నుండి తొలిగించాలని అధికారులను కోరారు. వైసీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఒక్క ఓటు మాత్రమే ఉండేల మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరారు. రెండవ ఓటును కలిగిన వారిని గుర్తించి ఓటరు జాబితా నుండి తొలిగించాలని క్రాంతికుమార్ కోరారు. ఎన్నికల సంఘం వారు జిల్లా లో చనిపోయిన వారి ఓట్లు తొలిగించాలని క్రాంతికుమార్ విజ్ఞప్తి చేశారు.
ఒంగోలు , కనిగిరి ఆర్డీవోలు
కళావతి, కేశవర్ధనరెడ్డి,స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, జాన్సన్, కుమార్, వరకుమార్, సత్యనారాయణ, రవీంద్రారెడ్డి జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు, తహసిల్దార్లు చిరంజీవి,శివశంకర్, భాస్కర్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్,, టీడీపీ కోనేటి వెంకటరావు ,కాంగ్రెస్ పార్టీ రసూల్, బీజేపీ గుర్రం సత్యం, బీఎస్పీ సుదర్శన్,జిల్లా ఎలక్షన్ ఆఫీస్ నుండి ఉపేంద్ర, డిటి లు రాజశేఖర్ రెడ్డి, సలోమి,పాల్గొన్నారు.

