జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గుంటి గంగా భవాని సన్నిధిలో నిర్మిస్తున్న జై భీమ్ మాలల అన్నదాన సత్రం నిర్మాణానికి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈత ముక్కల గ్రామస్తుడు, బెంగుళూరు కన్స్ట్రక్షన్ వ్యాపారస్తుడు బత్తుల ఐ బాబును సహకరించాలని కోరారు. దీంతో స్పందించిన ఆయన సోమవారం భార్య విజయలక్ష్మి, కుమారులు జీవన్ కుమార్, జశ్వంత్లతో కలిసి అన్నదాన సత్ర నిర్మాణాన్ని పరిశీలించి తల్లిదండ్రులు బత్తుల అంకయ్య, అంకమ్మ, పేరుపై రూ.8 లక్షల వ్యయంతో ఒక రూమ్ను నిర్మిస్తానని చెప్పి, చెక్కును కమిటీ సభ్యులకు అందజేసారు. కమిటీ సభ్యులు దార అంజయ్య, ఎల్లమంద, పులి వికాన్, రమణయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
