బేగంపేట అక్టోబర్ 26(జే ఎస్ డి ఎం న్యూస్):
స్కాలర్ షిప్ లు ప్రభుత్వ భిక్ష కాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-సికింద్రాబాద్ జిల్లా, మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విదార్థులతో భారీ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎబివిపి సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క. బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8500 కోట్ల విడుదల చేయక విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని సకాలంలో స్కాలర్షిప్ ఫీజురియంబర్స్మెంట్విడుదల కాకపోవటం
వల్ల ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కళాశాలలను మూసుకునే దుస్థితి దాపురించిందని, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వం విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్స్ జారీ చేయటం లేదని ఫలితంగా విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించటంలేదని , స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వ బిక్ష కాదని విద్యార్థుల హక్కు అని వెంటనే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో ఎబివిపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన భారీ స్థాయి ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ డి హైదరాబాద్ మహానగర కన్వినర్ పాండురంగ్,మారేడుపల్లి టౌన్ సెక్రటరీ కృష్ణ, వెంకట్, రామ్,శ్రీరామ్, రిషి, వినోద్, పవన్, తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు


