తాళ్లూరు మండలంలో మొంధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురిసింది. ఉదయం కొంత సమయం తెరప ఇవ్వటంతో రైతులు వారి పనులలో నిమగ్నమైనారు. అనంతరం 8 గంటలకు మొదలైన వర్షం ఈదురు గాలులతో కురిసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 27.2 మి.మీలు వర్షపాతం నమోదు అయినది.
తాళ్లూరు మండలంలో గుంటి గంగ వద్ద రెడ్ల సత్రం లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని డిప్యూటీ కలెక్టర్ కుమార్, మండల స్థాయి అధికారులు పరిశీలించారు .
పునరావాస కేంద్రంలో భోజన వసతి పరిశీలించారు. అనంతరం వెలుగు వారి పాలెంలో వలస కార్మికులు ఉన్నారన్న సమాచారంతో అధికారుల బృందం అక్కడకు వెళ్లి విచారించారు. వారికి పాఠశాలలో వారికి వసతి ఏర్పాటు చేసి అక్కడే ఉండాలని చెప్పారు. బొద్దికూర పాడు ఎస్టీ కాలనీవాసులకు సచివాలయంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజనం వసతి ఏర్పాటు చేశారు.
డిప్యూటీ కలెక్టర్ ప్రత్యేక అధకారి కుమార్, తహీసీల్దార్ రమణా రావు, ఎంపీడీఓ అజిత, ఎంఈఓ సుబ్బయ్య, విఆర్డిఓ చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు. గుంటి గంగ వద్ద రెడ్ల సత్రంలో వైద్యాధికారి మౌనిక, వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసారు.
వాగుల వద్ద ప్రత్యేక రక్షణ ఏర్పాటు …
ఎస్పీ హర్షవర్థన్ రాజు అదేశాల మేరకు, ఎస్సై మల్లిఖార్జునరావు సమక్షంలో ఎఎస్సై భాస్కరరావు పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది వాగులపై నిరంతరం పర్యవేక్షణ చేసారు. తాళ్లూరు- విఠలాపురం, తాళ్లూరు- రజానగరం మధ్య దోర్నపు వాగు వద్ద రక్షణ స్థంబాలకు మెకులు కట్టి ఉంచారు. దోసకాయల పాడు- బెల్లంకొండ వారి పాలెం వాగు వద్ద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసారు. తాళ్లూరు పీహెచ్సీలో వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేష్ యాదవ్లు వైద్యసేవలు అందించారు.
వ్యవసాయాధికారి ప్రసాద రావు విఏఏలను అప్రమత్తం చేసి రైతులకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలిపారు. కోతకు వచ్చిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఇప్పటికే తుఫాన్కు ముందు వర్షాలు, ప్రస్తుత వర్షం కలిపి 11 రోజుల పాటు వర్షాలు ఉన్నందున పంటలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు.





