బేగంపేట అక్టోబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరం లో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,సికింద్రాబాద్ సర్కిల్ ప్యారడైజ్ ఏ డి ఈ శివ దుర్గ ప్రసాద్ కొన్ని సూచనలు చేశారు. ట్రాన్స్ఫార్మర్ల కింద చెత్త వేయవద్దని, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని అన్నారు.వర్షాల్లో ముందస్తుగా కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడిసిన కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు.విద్యుత్ లైన్‌కి తగులుతున్న చెట్లను ముట్టుకోవద్దు. చెట్లు కూడా షాక్ కొడతాయి. విద్యుత్ లైన్‌కు చెట్టు కొమ్మలు తగిలితే, సంబంధిత అధికారికి కంప్లైంట్ ఇవ్వాలి. పార్కులలో గానీ, స్టేడియంలో గానీ విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దు.
ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవద్దు. బయట ఉండే లైట్లు నీటిలో తడవకుండా చూసుకోవాలి. కరెంటుకు సంబంధించిన వస్తువులను తడి చేతులతో ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు కరెంటు వస్తువుల దగ్గరకు రాకుండా చూసుకోవాలి.
ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.
గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దు. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేసినా, నీటిని ముట్టుకోవద్దు. ప్లగ్ తీసిన తర్వాతే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు “డిష్ ” కనెక్షన్ తీసివేయాలి. వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ మోటర్స్, కంప్యూటర్‌ల యొక్క స్విచ్‌లు ఆఫ్ చెయ్యాలి. లేదంటే వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.కరెంటు లైన్ కింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.
ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయితే, సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతి కరెంటు వస్తువుకూ “ఎర్త్ ” తప్పనిసరిగా ఉండాలి.
లేదంటే కరెంట్ షాక్ కొడుతుందని వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ
విజ్ఞప్తి చేశారు.ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జనరల్ బజార్ 8712470542,బైబిల్ హౌస్ 8712470537,ప్యారడైజ్ 8712470536, క్లాక్ టవర్ 8712470540 ఎఫ్ ఓ సి ఎమర్జెన్సీ నంబర్ల కు ఫోన్ చేయాలన్నారు.
