శాంతించిన వరుణుడు – ఉదృతంగా దోర్నపు వాగు రాక పోకలు బంద్ – పొంగిన వాగులు – నేల కొరిగిన చెట్లు- మునిగిన పంటలు

మొంథా తుఫాన్ తీరం దాటటంతో ఎట్టకేలకు బుధవారం ఉదయం వాతావరణం తెరపి ఇచ్చినది. ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత ఎండ చూడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ ప్రభావానికి తోడు వరుసగా ముందు ఆరు రోజుల పాటు భారీ వర్షాలు తోడు అవటంతో గత పదేళ్లలో ఉధృతంగా పొంగని వాగులు పొంగాయి. తుఫాన్ ప్రభావంతో మండలంలో 197.0 మి.మీల వర్షపాతం నమోదు కాగా గత వారంలో భారీ వర్షాలతో అది 245.0 మి.మీలు గా మారింది. దీంతో తాళ్లూరు- విఠలాపురం, లింగాల పాడు- మన్నేపల్లి, దారం వారి పాలెం – తూర్పుగంగవరం, దోసకాయల పాడు- తోట వెంగన్న పాలెం, తాళ్లూరు-రజానగరం, తాళ్లూరు కుంకుపాడు మధ్య రాక పోకలు నిలిచి పోయాయి. వాగు పొంగినట్లయితే ప్రత్యామ్నాయంగా మన్నేపల్లి హై లేవల్ బ్రిడ్జి ద్వారా వెళ్లేలా అవకాశం ఉండేది. కాని హై లేవల్ బ్రిడ్జి కూడ పొంగి ప్రవహిస్తున్నది. దీంతో పోలీసులు ఆయా మార్గాలలో ఎస్సై మల్లిఖార్జున రావు అధ్వర్యంలో బందోబస్తు చేపట్టి పూర్తి స్థాయిలో రాక పోకలు నియంత్రించారు.
వరద ఉధృతికి నీట మునిగిన వరి పొలాలు జల దిగ్భందంలో గ్రామాలు … వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పాటు పంట పొలాలు నీట మునిగాయి. బెల్లకొండ వారి పాలెం వద్ద వరి పొలాలు నీట మునిగాయి. మొక్కజొన్న, బొబ్బాయి పంటలు నెల కొరిగాయి. మొక్కజొన్నతో పాటు పలు పంటలను వ్యవసాయాధికారి ప్రసాద రావు పరిశీలించి సస్యరక్షణ చర్యలను సూచించారు.
డిప్యూటీ స్పెషల్ ఆఫీసర్, మండల ప్రత్యేక అధికారి కుమార్, ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావు, ఎస్సై మల్లిఖార్జున రావు లు నిరంతరం తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టటంతో పెను నష్టం తప్పినట్లయినది. అయినా సరే దోర్నపు వాగు పొంగటంతో దారం వారి పాలెం, తోట వెంగన్న పాలెం జల దిగ్బంధంలో చిక్కుకున్నది. దోసకాయల పాడు- బెల్లంకొండ వారి పాలెం మధ్య వాగు పొంగటంతో ఆయా గ్రామాలకు రాక పోకలు నిలచాయి. దర్శి వైపు ప్రయాణంచేయటానికి తూర్పు వీరాయపాలెం వద్ద వాగు పొంగటంతో రాక పోకలు నిలిచాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సహాయక చర్యలు పర్యవేక్షించిన ప్రజా ప్రతినిథులు …

దోర్నపు వాగు పొంగటంతో ఆయా గ్రామాలకు రాక పోకలు నిలిచి పోవటంతో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డిలు ఆయా గ్రామాలలో వాగుల పరిస్థితిపై ఆరా తీసారు. దోర్నపు వాగు వద్ద ఉధృతిని పరిక్షించి అధికారులను అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *