మొంధా తుఫాన్ ను ఎదుర్కోవటంలో అధికారులు చూపిన చొరవ, కృషి అభినందనీయమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు పేర్కోన్నారు . తాళ్లూరు ఎంపీడీఓ ఛాంబర్ లో బుధవారం తుఫాన్ ను ఎదుర్కోని మండలంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా నివారించిన అధికారులకు ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అజిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ ల ఆదేశాలతో మండలంలో పార్టీ క్యాడర్ అధికారులకు అండగా నిలచి తమ వంతు చేయూత ఇవ్వటం అభినందనీయమని అన్నారు. అధికారులు మండల ప్రత్యేక అధికారిగా వచ్చిన ఎ కుమార్, ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావు, ఎంఈఓ-1, 2 లు జి సబ్బయ్య, సుధాకర్ రావు, ఎపీఓ వెంకట రావు, ఎపీఎం దేవరాజ్, వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేష్ యాదవ్, డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్, పశువైద్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎఈ హనుమంత రావు,అంగన్వాడీ, అరోగ్య, ఆశ, విర్ఓలు, గ్రామ కార్యదర్శులు అందరూ కూడ క్షేత్ర స్థాయిలో తమ వంతు కృషి చేసి ప్రజలను పెద్ద ముప్పు నుండి కాపాడారని కొనియాడారు. వలస కార్మికులను గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి రక్షించటం వారి ప్రాణాలను కాపాడినట్లు అయినదని చెప్పారు. సమన్వయంతో వ్యవహరించి సేవలు అందించిన అధికారులను జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి కొనియాడారు. వైఎస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పార్టీ యూత్ సెక్రటరీ గొల్లపూడి వేణుబాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, కళ్యాణ్, కొత్త పాలెం పార్టీ అధ్యక్షుడు ఎం వెంకట రెడ్డి, బొడ్డు హనుమా రెడ్డి, కళ్యాణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.





