బేగంపేట, అక్టోబర్ 30(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పరిధిలోని ఫంక్షన్ హాల్స్ నుంచి రాత్రి,పగలు అనే తేడా లేకుండా వచ్చే భారీ శబ్దాలతో తమకు చాలా ఇబ్బందిగా ఉందంటూ స్థానికుల నుంచి బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణమూర్తి కి పిర్యాదులు వస్తున్నాయి.ఇటీవల బేగంపేట ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీకి చెందిన రవిచంద్ర పైగా ప్యాలెస్ ఫంక్షన్ హాల్స్ నుంచి లౌడ్ మ్యూజిక్,ఆర్కెస్టాలతో ధ్వని కాలుష్యం అధికమవుతుందని,నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు.అధిక శబ్దాలతో చాలా ఇబ్బందిగా ఉందంటూ పిర్యాదులో పేర్కొన్నారు.అధిక వాల్యూం తో గుండె సంబంధిత వ్యాధుల ఉన్నవారితో పాటు చిన్నారులపై ధ్వని కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని.తమ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు.ప్రశాంత వాతావరణం కలిగించేందుకు కృషి చేయాలన్నారు.బేగంపేట తో పాటు రసూల్ పురా పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్స్ వల్ల తమ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తలెత్తడంతో పాటు శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని నియంత్రణకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
