కూకట్ పల్లి అక్టోబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నందం రామ ప్రసాద రావు జనసేన అభిమాని అని,జనసేన విజయం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని కూకట్ పల్లి నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కొనియాడారు.గురువారం జే ఎన్ టి యు మెట్రో స్టేషన్ వద్ద పిస్తా హౌస్ బ్యాంకెట్ హాలులో
లయన్ నందం రామ ప్రసాద రావు దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముందుగా రామ ప్రసాద రావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి తనానికి మారుపేరుగా నిలిచారని అన్నారు.లయన్స్ క్లబ్ ద్వారా సమాజం కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరచి పోలేనిది అని అన్నారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ,వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బందు మిత్రులు పాల్గొన్నారు.
