తాళ్లూరు-విఠలాపురం గ్రామాల నడుమ గల దోర్నపువాగు చప్టాను హైలెవెల్ చప్టా నిర్మాణంకు చర్యలు చేపట్టి తాళ్లూరు ప్రాంత ప్రజల రాక పోకలకు ఇబ్బందులు తలెత్త కుండా కృషి చేస్తానని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టి పాటిలక్ష్మి తెలిపారు. మొంథా తుఫాన్ వల్ల తాళ్లూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు గురవారం ఆమె తాళ్లూరులో పర్యటించారు. తాళ్లూరు- విఠలాపురం గ్రామాల నడుమ రెండు రోజులైనా ప్రవాహం తగ్గక రాక పోకలకు ఇబ్బందిగా వున్న దోర్నపువాగు చప్టాను పరిశీలించారు. తాళ్లూరు నుండి అన్ని గ్రామాలకు ప్రధాన రహదారిగా వున్న ఈ మార్గంలో గల దోర్నపువాగు లోలెవెల్ చప్టా వల్ల వాగు ప్రవహించినప్పుడల్లా రాక పోకలకు ఇబ్బందిగా తయారైందని టీడీపీ నేతలు ఆమె దృష్టికి తీసుక వచ్చారు.
గత టీడీపీ ప్రభుత్వంలో రాక పోకలకు ఇబ్బందిగా వున్న చప్టాకు కొంత మేర మరమ్మత్తులు చేయించారన్నారు. చిన్నపాటి వర్షం కురిసినా చప్టాపై గుండా వాగు ఉదృతంగా ప్రవహిస్తూ వాహన రాక పోకలకు అవరోధంగా వుంటుందన్నారు. వర్షం కురిసినప్పుడల్లా వాగు ప్రవహిస్తూ హైదరాబాద్ , విజయవాడ ,అద్దంకి బస్సు సర్వీసులు రద్ద అవుతూ ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లా డుతూ …రాష్ట్ర ఆర్అండ్ బి మంత్రి, అధికారుల దృష్టికి ఈ చప్టా నిర్మాణ ప్రాధాన్యతను
తీసువెళ్లి హైలెవల్ చప్టా నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు తనవంతు కృషి చేస్తారన్నారు. తుఫాన్ జరిగిన పంట నష్టాలను ఏవో ప్రసాద్ రావు ను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహరం అందేలా చూడాలని ఏవోకు సూచించారు. ఈకార్యక్రమంలో దర్శి టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్, ఎం పీపీ తాటికొండ శ్రీనివాసరావు, రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్రతెలుగు యువత కార్యదర్శి వేణుబాబు, మన్నేపల్లి సొసైటీ అధ్యక్షులుగొంది రమణా రెడ్డి,
పిన్నిక రమేష్ కుమ్మిత సుబ్బారెడ్డి, ముండ్లమూరు టీడీపీఅధ్యక్షులు శ్రీనివాసరావు, విద్యాసాగర్, ఎంఈవో సుబ్బయ్య, సీఐ రామారావు, ఎస్సై మల్లికార్జునరావు,డిటీ ఫణీంద్ర, ఆర్ఎ సుధీర్, విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

